Saturday, July 12, 2014

బ్రిక్స్’ నాయకత్వంలో అభివృద్ధి బ్యాంక్

ప్రపంచబ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ను నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై వచ్చే వారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంక్ ఏర్పాటుపై 2013లోనే సభ్యదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’ పేరుతో బ్రిక్స్ దేశాల నాయకత్వంలో ఏర్పాటుచేయనున్నట్లు రష్యా ఆర్థిక మంత్రి ఆంటన్ సిల్యునోవ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. బ్రిక్స్‌లో సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు రెండు బిలియన్ అమెరికా డాలర్ల చొప్పున మూలధనంగా సమకూరుస్తాయని ఆయన తెలిపారు

రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఓకే

చంద్రబాబు ఎన్నికల హామీగా ఉన్న రైతు రుణ మాఫీ అమలుకు మరిన్ని నెలలుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐతో జరిపిన చర్చలు కొంతమేరకు ఫలించాయి. రాష్ట్రంలోని 572 మండలాల్లో దాదాపు పదినుంచి పదకొండు వేల కోట్ల రూపాయల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సంకేతాలు వచ్చాయి. ఇది కేవలం గత ఏడాది ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 14న ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.