Sunday, December 8, 2013

India lost the Match

లక్ష్యసాధనలో తడబడిన భారత్ రెండో వనే్డను కూడా చేజార్చుకోగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి వనే్డను గెల్చుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి, చివరిదైన మూడో వనే్డని నామమాత్రపు మ్యాచ్‌గా మార్చేసింది. క్వింటన్ డికాక్, హషీం ఆమ్లా సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో ఆరు వికెట్లకు 280 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. 35.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్ప కూలి, 134 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

No comments:

Post a Comment